Mar 28,2021 12:12

ఊరగాయ..
కావాల్సిన పదార్థాలు :
ఉసిరికాయలు- కిలో, ఉప్పు- అరకప్పు, నిమ్మకాయలు- నాలుగు, నువ్వులనూనె- ముప్పావు కప్పు, ఆవాలు - అరస్పూన్‌, పసుపు - చిటికెడు, కారం పొడి - అరకప్పు, మెంతిపొడి - పావుకప్పు, ఇంగువ - స్పూన్‌.
తయారుచేసే విధానం :

  • ఉసిరికాయలను నీళ్లల్లో కడిగి, ఆరబెట్టాలి.
  • పాన్‌లో నువ్వులనూనె వేసి కాగనివ్వాలి. తర్వాత అందులో ఆవాలు, ఇంగువ, ఉసిరికాయలు వేసి మెత్తబడే వరకూ మూతపెట్టి, సన్నని మంటపై ఉంచాలి.
  • గిన్నెలోని ఉసిరికాయలు మెత్తబడిన తర్వాత దించేయాలి.
  • కాసేపటి తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి వేసి, నిమ్మరసం పిండి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.
  • ఆ మిశ్రమాన్ని మూడురోజుల పాటు జాడీలో ఊరనివ్వాలి. అంతే... ఉసిరికాయ పచ్చడి రెడీ!
ఆమ్లకం.. ఆరోగ్యం..


పులుసు..
కావాల్సిన పదార్థాలు :
ఉసిరికాయలు - నాలుగు / ఆరు, ఉల్లిగడ్డ ముక్కలు - అర కప్పు, టమాటా ముక్కలు - అరకప్పు, పసుపు - పావుస్పూన్‌, ఉప్పు - అరస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కారం - స్పూన్‌, ధనియాల పొడి - స్పూన్‌, జీలకర్ర పొడి - స్పూన్‌, నూనె - మూడు / నాలుగు స్పూన్లు,
పోపు కోసం : జీలకర్ర - పావుస్పూన్‌, ఆవాలు - పావుస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు- కావాల్సినంత.
తయారు చేసే విధానం :

  • ముందుగా ఉసిరికాయల్ని కడిగి, తుడిచి పెట్టుకోవాలి.
  • స్టవ్‌ ఆన్‌చేసి పాన్‌లో రెండు స్పూన్ల నూనెపోసి, ఉసిరికాయల్ని వేసి దోరగా వేగించుకోవాలి. అవి కొద్దిగా పగులుతాయి. వాటిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి.
  • మిగతా రెండు చెంచాలు నూనెవేసి పోపు సామాగ్రి వెయ్యాలి. అవి వేగుతుండగా ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. తితర్వాత టమాటా ముక్కలు వేసిి వేగిస్తూ పసుపు, కారం వేసి గరిటతో టమాటా ముక్కలు మెత్తగా నొక్కుతూ.. ఒక ముద్దగా అయ్యేలా ఉడికించు కోవాలి.
  • నీరు కలిపి చక్కని గ్రేవీలా తినే రుచిని బట్టి పలుచగా చేసుకోవచ్చు.
  • తర్వాత ఉసిరికాయల్ని ఉడికే ఆ పులుసుకూర మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి జోడించి మూతపెట్టాలి. దగ్గర పడేదాకా ఉడికించుకుని, స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
  • పులుసు కూరను వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చపాతీలోనూ చాలా రుచిగా ఉంటుంది.
ఆమ్లకం.. ఆరోగ్యం..


మసాలా రైస్‌..
కావాల్సిన పదార్థాలు :
బియ్యం- కప్పు, ఉసిరి తురుము- అరకప్పు, పసుపు, ఉప్పు- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, ఆవాలు- అర టీస్పూన్‌, మినప్పప్పు- అర టీస్పూన్‌, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి- టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి- ఐదు, వెల్లుల్లి- మూడు రెబ్బలు, దాల్చిన చెక్క- చిన్నముక్క, అల్లం- చిన్నముక్క, కొబ్బరి తురుము- పావు కప్పు, కొత్తిమీర తురుము- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం :

  • బియ్యం కడిగి, బాగా మెత్తగా కాకుండా పొడి పొడిగా వండుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, దాల్చిన చెక్క, అల్లం, కొబ్బరి తురుము, కొత్తిమీర తురుము అన్నీ కలిపి రుబ్బుకోవాలి.
  • పాన్‌లో నెయ్యి, నూనె కాచి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి, పోపు చేసుకోవాలి.
  • అందులోనే రుబ్బిన ముద్ద చేర్చి, మంచి సువాసన వచ్చేదాక వేగించుకోవాలి. దానికి ఉసిరి తురుము చేర్చాలి.
  • తర్వాత ఉప్పు, పసుపు వేసి వండిన అన్నం కలిపి దించుకోవాలి. ఈ మసాలా రైస్‌ ఉల్లి పెరుగు పచ్చడితో తింటే మహా భేషుగ్గా ఉంటుంది.
ఆమ్లకం.. ఆరోగ్యం..

జ్యూస్‌..
కావాల్సిన పదార్థాలు :
ఉసిరికాయలు- అరకేజీ, తాటిబెల్లం / చక్కెర- కేజీ, అల్లం పొడి- ఐదు గ్రాములు, యాలకుల పొడి- ఐదు గ్రాములు, తేనె- కావాల్సినంత.
తయారుచేసే విధానం : 

  • ముందుగా ఉసిరికాయలను ఆవిరిపై ఉడికించుకోవాలి. అవి బాగా చల్లారిన తర్వాత విత్తనాలు తీసి కాయలను రుబ్బుకోవాలి.
  • అందులో 300 మిల్లీ లీటర్ల వరకూ నీటిని కలపాలి. ఎక్కువ జ్యూస్‌ కోసం ఆ మిశ్రమాన్ని బాగా పిండుకోవచ్చు.
  • తాటిబెల్లం / చక్కెరను 200 మిల్లీలీటర్ల నీటిలో వేసి, వేరే పాత్రలో బాగా మరిగించాలి.
  • వేడెక్కిన చక్కెర నీటిని ఉసిరి మిశ్రమంలో వేసి, బాగా కలిసే వరకూ కలుపుకోవాలి.
  • మిశ్రమాన్ని బాగా కలపడంతో ఉసిరి జ్యూస్‌ సిద్ధమవుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..
ఆరోగ్యకరమైన శీతల పానీయంగా ఉసిరి జ్యూస్‌ తాగొచ్చు. అంతేకాకుండా తక్షణ శక్తినిచ్చే పానీయంగా ఇది పనిచేస్తుంది. దీనిలో క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌-సి, బీ-కాంప్లెక్స్‌, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌, అథెరో స్కెరోప్లిసిస్‌, రక్తహీనత, పెప్టెక్‌ అల్సర్‌, యూరినరీ ఇన్ఫెక్షన్‌, విరేచనాలులాంటి సమస్యకు మంచి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది.