Jan 20,2023 23:45

రామభద్రరావు (ఫైల్‌ఫొటో)

ప్రజాశక్తి-అచ్యుతాపురం
మండలంలోని తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కర్రి రామభద్రరావు అనారోగ్యంతో అమెరికాలో మృతి చెందారు. దీతో తిమ్మరాజుపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామభద్రరావు కుటుంబ సభ్యులను పలువురు పరామర్శిస్తున్నారు. రామభద్ర రావు గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామభద్రరావు తిమ్మరాజుపేట ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు, ఎలిమెంటరీ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పన, వృద్ధులకు చీరలు, దుప్పట్లో పంపిణీ, గ్రంథాలయం ఏర్పాటు, గ్రామంలో పారిశుధ్య కార్మికులకు ఆర్థిక సహాయం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.