ప్రజాశక్తి-పిచ్చాటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రకటించిన నేపధ్యంలో అఖిలపక్షం నాయకులతో శనివారం తహశీల్దార్ మధుసూదన్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 9 నుండి మార్చి 30 వరకు అమల్లో నేపథ్యంలో రాజకీయ పార్టీ వారు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అఖిలపక్షం నాయకులు సూచించారు. పిచ్చాటూరు ఎంపిపి పాఠశాల ఆవరణలో 2 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టబద్రలు ఓటర్లు 685 మంది ఉపాధ్యాయులు 16 మంది ఉన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన ఓటరు నమోదు మార్చి 13 వరకు ఆవకాశం ఉన్నదిన్నారు. పూర్తి స్థాయి ఓటురు లిస్టు ప్రకటిస్తామని చెప్పారు.ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రలోభాలకు గురిచేసినట్లు దృష్టికి వస్తే చర్యలుకు ఉపక్రమస్తామని, ఎన్నికల కోడ్ ని అతిక్రమిస్తే న్యాయపరమైన పోలీసుల సాయంతో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సిపిఎం మండల కార్యదర్శి రామచంద్ర రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు తిరుమలరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు హరిచంద్ర రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.










