యు.కొత్తపల్లి : మూలపేట వాడబలిజ పేటలో ఉన్న రామాలయానికి రూ.4 కోట్ల 19 లక్షల 83 వేల విద్యుత్ బిల్లు రావడంతో గ్రామస్తులు అవాకయ్యారు. బుధవారం విద్యుత్ బిల్ కలెక్టర్ ఆగస్ట్ నెలలో వాడిన విద్యుత్ బిల్లు తీయగా ఒక కోటి ఏడు లక్షల యూనిట్లు వినియోగించినట్లు రావడంతో షాక్‌కు గురయ్యారు రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు ఉన్న చిన్న ఆలయానికి ఇంత మొత్తంలో బిల్లు రావడంతో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని గ్రామస్తులు తెలిపారు దీనిపై విద్యుత్ ఎఇ ప్రసాద్‌ను కలిశారు. మీటర్‌ను పరిశీలించగా మీటర్ స్కానింగ్ చేసే సమయంలో పొరపాటు జరిగినట్టు ఎఇ తెలిపారు.










