Jun 28,2023 21:03

మాట్లాడుతున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

వాల్మీకిపురం : మన సంస్కృతిక, సాంప్రదాయాలను మనమే కాపాడాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొత్త మంచూరులో టిటిడి నిధులతో చేపట్టనున్న ఆలయ జీర్ణోద్ధరణ పనులను ప్రారం భించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లా డుతూ పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఇలాంటి నాయ కులను ప్రజలు కాపాడుకుంటే నియోజకవర్గం మరింత అభివద్ధి చెందు తుందన్నారు. పీలేరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, బైపాస్‌ రోడ్ల నిర్మాణం, ఆసుపత్రులు, విద్యా సంస్థల అభివద్ధి, సాగు, తాగునీటి వసతి తదితర తదితర అభివద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. మంచూరు గ్రామంలో ఆలయ నిర్మాణానికి ముస్లింలు స్థలాలను దానం చేసి మతసా మరస్యాన్ని చాటుకోవడం అభినందనీయమని, వాల్మీకిపురం మండలం తనకు సదుం మండలంతో సమానమన్నారు. ఈ రెండు మండలాలు తనకు తల్లి లాంటివని, ఈ మండలాల్లో తమ పార్టీకి వచ్చే మెజారిటీ విజయానికి పునాదులు వేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిలు పీలేరు నియోజకవర్గ అభివద్ధికి విశేష సేవలు అందిస్తున్నారని, ఈ నియోజకవర్గాన్ని తమ సొంత నియోజకవర్గంగా భావించి సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రాజధానులకు పరిమితం కాకుండా మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం పర్యటించి ప్రజలకు సేవలు అందిస్తూ ఎంపీ మిథున్‌ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారని, నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఆయనను ప్రజలు ఎప్పటికీ విస్మరించరాదన్నారు. తదనంతరం రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఆటుపోటులు ఎదుర్కొన్న తనలాంటి వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ ఆదరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టిడిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్‌ కుమార్‌, ఏపీఎండీసీ డైరెక్టర్‌ హరీష్‌ రెడ్డి, జడ్పిటిసి నిర్మల, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ అబ్దుల్‌ కలీమ్‌, నాయకులు సహదేవ రెడ్డి, రమేష్‌, చింతల సాయిక్రిష్ణారెడ్డి, చింతల శివానందరెడ్డి, జింక వెంకట చలపతి, నీళ్ల భాస్కర్‌, శంకర్‌ రెడ్డి, బిడ్డల కేశవరెడ్డి, చిన్న, నాగరాజ పాల్గొన్నారు.