ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఉపమాక (లక్ష్మణేశ్వరస్వామి దేవస్థానం) శివాలయంలో శివ, పార్వతుల కళ్యాణం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. వేద పండితులు మంత్రోచ్చారణతో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు మహేష్, వెంకన్న ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాద్ ఆచార్యులు పెండ్లిని చేపట్టారు.రాత్రి 10 గంటల నుండి 12.30 గంటల వరకు కళ్యాణ మహౌత్సవాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కల్యాణాన్ని తిలకించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెరుకూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఎస్.రాయవరం:మండలంలోని కొరుప్రోలు గ్రామంలో సీతారామస్వామి కళ్యాణం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం తోడుపెద్దిని ఆలయంలో స్వామి వారి సన్నిధిలో ఉంచి కళ్యాణంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు చేకూరి శ్రీరామచంద్రరాజు, కొరపాటి గోపాలం, పుట్టా సుధాకర్, కోరా రామారావు, రాజు పాల్గొన్నారు.










