
శంకుస్థాపనలో పాల్గొన్న మహీధర్ రెడ్డి
ప్రజాశక్తి-ఉలవపాడు :మండలంలోని చాగొల్లులో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణం శంకుస్థాపన గురువారం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరి ఎంఎల్‌ఎ మానుగుంట మహేందర్ రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట సర్పంచి లేళ్ళపల్లి లతా చంద్రశేఖర్, శ్రీశైల దేవస్థానం సభ్యులు ధర్మరాజు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ యనమాల మాధవి, వైఎస్‌ఆర్సిపి నాయకులు కడియాల సుబ్బారావు, గాజుల శీను, కాకు గోపి, వర్ధినేని కోటేశ్వరరావు, జాజుల వెంకటేశ్వర్లు, తమ్మినేని నరసింహనాయుడు, కారసాల శీను, అంకమ్మ నాయుడు, కడియాల రామ్మూర్తి ఉన్నారు.