Nov 21,2023 19:30

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ
ఆలయ నిర్మాణాలకు నిధులు మంజూరు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌:ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో ఆధ్యాత్మికత విరాజిల్లే విధంగా ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా 62 దేవాలయాలకు నిధులు మంజూరయ్యాయని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీధర్‌ గార్డెన్స్‌లో మంగవారం శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణాలకు తీసుకోవాల్సిన చర్యల గురించి దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ దేవాలయం ఉన్న గ్రామం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుందని, దేవాలయానికి వెళ్లి వచ్చిన వారికి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. పలువురికి మంచి చేయాలనే ఆలోచన చేస్తారని, ఇందుకోసం ప్రతి పంచాయతీలో దేవాలయ నిర్మాణాలను చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో దేవాలయాల నిర్మాణాల కోసం అందరి సమిష్టి సహకారంతో కషి చేశామన్నారు. వారం రోజుల వ్యవధిలోని 58 దేవాలయాలను గుర్తించడం జరిగిందని, దీనికి శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
అనంతసాగరం సోమేశ్వరస్వామి దేవాలయం, హరిస్వామి దేవాలయం, చేజర్లలోని దేవి సమేత చెన్నకేశవస్వామి ఆలయం, సంగంలోని శ్రీసీతారామాలయాల నిర్మాణాలకు రూ.2.50 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మికశోభను సంతరించుకునే విధంగా చేయాలనే సంకల్పానికి సహకారం అందించిన ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ పూర్వపు చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుత చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జిల్లాలో 99 దేవాలయాలు మంజూరైతే అందులో 80 శాతం అంటే దాదాపు 58 దేవాలయాల నిర్మాణాలకు ఆత్మకూరు నియోజకవర్గంలోనే అందచేయడం జరిగిందని, ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఆయన మన నియోజకవర్గానికి అందచేసిన ఈ నిధులతో నిర్మించే దేవాలయాలను ఆయన జన్మదినం నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గం జిల్లాలో 9 స్థానంలో నిలిచి ఉందని, రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ అభివద్ది కార్యకర్మాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఆత్మకూరు నియోజకవర్గంలో అందరూ తమ సహకారం అందిస్తే 10 సంవత్సరాల కాలంలో జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతామన్నారు.
అంతకు ముందుగా కీర్తిశేషులు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్‌ రెడ్డిల చిత్రపటాలకు ఎమ్మెల్యే మేకపాటి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ జె. శ్రీనివాస రావు , అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఎ. మురళీమోహన్‌, వాస్తు ప్లానింగ్‌ అసిస్టెంట్‌ స్తపతి, పి సురేంద్ర శ్రీవాణి ట్రస్ట్‌ ఇన్‌ఛార్జ్జ్‌ పి. రవికుమార్‌, ఆత్మకూరు ఎంపీపీ కేత వేణుగోపాల్‌ రెడ్డి, జేసిఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య , పట్టణ అధ్యక్షులు అల్లా రెడ్డి ఆనంద్‌ రెడ్డి , మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ , వైస్‌ చైర్మన్‌ లు డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ , షేక్‌ సర్దార్‌, వైసీపీ నాయకులు ఐవి రమణారెడ్డి, నోటి వినరు కుమార్‌ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.