ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు పట్టణంలోని స్టేట్ బ్యాంకు ముందు ఖాతాదారుడు డ్రా చేసిన రూ.3 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆలూరు పట్టణానికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి గోవిందు సోమవారం బ్యాంకుకు వెళ్లి రూ3. లక్షలు డ్రా చేసుకొని బయటకు వచ్చారు. బ్యాంకు బయట ఉన్న తన ద్విచక్రవాహనానికి ఉన్న సైడ్ బ్యాగ్‌లో రూ.3 లక్షలు పెట్టారు. అప్పటికే ఆయనను గమనిస్తూ వెంబడిస్తున్న కొందరు తెలియని వ్యక్తులు ఆయన బండికి మరో స్కూటర్‌లో అడ్డుగా వచ్చారు. వెనుకల నుంచి వచ్చిన ఆ వ్యక్తులు ఆయనతో మాటలు కలిపారు. మాట్లాడుతుండగానే సైడ్ బ్యాగ్‌లో ఉన్న డబ్బును దొంగలించుకొని వెళ్లి పోయారు. ఇంటికి వెళ్లి చూడగానే ఒక్క సారిగా షాక్‌కు గురైన గోవిందు లబోదిబోమంటూ బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ డాక్టర్ నాయక్ బ్యాంకుకు చేరుకొని బాధితుని విచారించారు. బ్యాంకులో ఉన్న సిసి ఫుటేజీతో పాటు బ్యాంకు పక్కన ఉన్న దుకాణాల్లో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు సిసి ఫుటేజీలో అనుమానితులుగా ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు.
బ్యాంకులో సిసి ఫుటేజీని పరిశీలిస్తున్న సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాయక్










