దొంగతనం జరిగిన కొత్త బస్టాండ్ ముందున్న దుకాణం
ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరులో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆదివారం రాత్రి కొత్తబస్టాండ్ ముందున్న నబీ, గజేంద్ర దుకాణంలో నగదు, సరుకులు, హులేబీడు ఆంజనేయస్వామి గుడిలో హుండీ పగులగొట్టి నగదు దోచేసినట్లు బాధితులు, గ్రామస్తులు తెలిపారు. గతనెల 22న ఆలూరు స్టేట్ బ్యాంకు ఆవరణలో బ్యాంకు విశ్రాంత ఉద్యోగి తన ఖాతా నుంచి రూ.3 లక్షలు డ్రా చేసి, ద్విచక్ర వాహన బ్యాగ్‌లో పెట్టుకొన్న నగదును దొంగలు అపహరించారు. ఈ సంఘటన మరువకముందే వరుస దొంగతనాలు జరుగుతున్నందున పట్టణ వాసులు ఆందోళ చెందుతున్నారు. మంత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలీసుల నిఘా నేత్రాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం కష్టతరమైనట్లు తెలిసింది.










