ప్రజాశక్తి-చీరాల: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. చీరాల పట్టణంలో 25 సచివాలయాల అడ్మిన్లతో గురువారం కమిషనర్ రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ చాంబర్ జరిగిన నిర్వహించిన సమావేశంలో సచివాలయాల అడ్మిన్లకు కమిషనర్ పలు సూచనలు అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చే ప్రజల ఇబ్బందులు పెట్టకుండా వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వాలంటరీలు సమన్యయంతో పనిచేసి చీరాల మున్సిపాలిటీకి మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వార్డుల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు పాల్గొన్నారు.










