- జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
ప్రజాశక్తి - టెక్కలి రూరల్: విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యల తప్పవని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ హెచ్చరించారు. స్థానిక ఆదిత్య కళ్యాణ మండపంలో టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తొమ్మిది మండలాల తహశీల్దార్లు, రీసర్వే అర్‌ఐలు, ల్యాండ్ రికార్డ్స్ సిబ్బంది, విఆర్‌ఒలు, రెవెన్యూ సిబ్బందితో భూ సమగ్ర రీసర్వేపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. లేకుంటే విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. అనంతరం మండలాల వారీగా భూ రీ సర్వే అంశాలపై ప్రగతిని పరిశీలించారు. రీ సర్వే అంశాల్లో వెనుకబడి ఉన్న పలువురు రెవెన్యూ సిబ్బందిపై జెసి అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, పలాస ఆర్‌డిఒ టి.సీతారామ్మూర్తి, టెక్కలి తహశీల్దార్ కె.ప్రవళ్లిక, పలువురు తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.










