ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ గ్లోరీ కార్యక్రమంలో చిన్నారులు అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ వ్యవస్థ పై అవగాహన కలిగే విధంగా ఫ్యామిలీ గ్లోరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంతరించి పోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పునరుద్దించేందుకు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో పాటు సమాజంలో పెద్దలందరని గౌరవించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ చిటికెల శ్రీను తెలిపారు.విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక విద్యతో పాటు పలు అంశాల్లో అవగహన కలిగేలా స్మార్ట్ లివింగ్ కార్యక్రమం ప్రవేశపెట్టి కుటుంబం, ఆరోగ్యం, దేశభక్తి వంటి పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర శ్రీచైతన్య పాఠశాలల ఏ.జి.యం ఎం.వి.సురేష్, గాజువాక ప్రాంతీయ సంచాలకులు మాకిరెడ్డి రమణ, జోనల్ కోఆర్డినేటర్ లెంక రాజేష్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎన్. వి. రమణ, డీన్- వానపల్లి నాగేశ్వరరావు, ప్రైమరీ ఇన్ ఛార్జ్ నాగ మైథిలీ, సత్యప్రభ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










