Sep 20,2023 23:40

ప్రజశక్తి - చీరాల 
ప‌ట్ట‌ణంలోని బెస్త‌పాలెం గ‌ణేష్‌ ఉత్స‌వ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన గ‌ణ‌ప‌తి మందిరం వ‌ద్ద నిర్వ‌హించిన సాంసృతిక కార్య‌క్ర‌మాలు అల‌రింప‌జేశాయి. చిన్నారులు కూచిపూడి నృత్యం, భ‌ర‌త‌నాట్యం చేశారు. అబ్బుర ప‌రిచే ఘ‌ట్టాల‌ను చిన్నారులు ప్ర‌ద‌ర్శిస్తూ త‌మ ప్ర‌తిభానైపుణ్యాన్ని వేధికముందున్న‌ వీక్ష‌కుల‌కు కనువిందు చేశాయి. ఈ సంద‌ర్భంగా క‌మిటీ ప్ర‌తినిధులు మాట్లాడుతూ బెస్త‌పాలెం యూత్‌, గణ‌ప‌తి ఉత్స‌వ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో 16ఏళ్ల‌గా గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రులు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. దాత‌ల స‌హ‌కారంతో ఎంతో వైభ‌వంగా ప్ర‌తిరోజు పూజా కార్యక్రమాలు జ‌రుపుతామ‌ని చెప్పారు. అనంత‌రం భ‌క్తుల‌కు ప్ర‌సాదం పంపిణీచేశారు.