Jul 24,2022 23:25

నృత్యాలను ప్రదర్శిస్తున్న చిన్నారులు

ప్రజాశక్తి- పిఎం పాలెం : వారంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మధురవాడ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం జోష్‌ డాన్స్‌ అకాడమీ వారిచే నిర్వహించిన కూచిపూడి, జానపద నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా మహాగణపతిం మానస స్మరామి, ప్రణవలయదేవి, అఖిలాండేశ్వరి, ఐగిరినందిని, నెమలికి నేర్పిన నడకలివి, బ్రహ్మమొక్కటే, స్వామిరారా, గాజుల సవ్వడి, ఘల్లు ఘల్లు, జోడెడ్లబండి చూడు, మొక్క జొన్న తోటలో, రాజాం కొండ మీద, వదినకు ఒకసారి, కోయిలారే అనే అంశాలను ప్రదర్శించారు. మోహన లక్ష్మి, సంధ్య, గిషిత శ్రీ, సంజన, మోక్ష, బాశిత, మౌనిక, మన్విత, రోషణి, యశశ్విని, ప్రవల్య, చందు తదితర కళాకారులు నృత్యాలను ప్రదర్శించారని శిల్పారామం పరిపాలనాధికారి విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.