Aug 16,2023 23:10

ప్రజాశక్తి-సింగ్‌నగర్‌: డివైఎఫ్‌ఐ, సిఐటియు, ఐద్వా, కెవిపిఎస్‌, పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అజిత్‌ సింగ్‌ నగర్‌ పరిధిలోని 62, 63 డివిజన్లలో 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కళారూపాల ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారులు నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో అలరించారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘాల రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ ఎంతో స్వాతంత్ర ఫలాలు ప్రతిఒక్కరికీ దక్కాలన్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తవుతున్నా మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. కులాలు, మతాలు పేరుతో ప్రజలచిచ్చు పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి కె శ్రీదేవి, బి.రమణారావు, కె.దుర్గారావు, జి ఝాన్సీ, సిహెచ్‌ శ్రీనివాస్‌, ఎస్‌.కె నిజాముద్దీన్‌, పి సాంబిరెడ్డి, బి అమ్ములు, బి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.