ప్రజాశక్తి - నూజివీడు రూరల్
నూజివీడు పట్టణంలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఆదివారం 'హెల్పింగ్ హాండ్స్' 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్నేహ రైట్స్ అనాథ ఆశ్రమంలోని చిన్నారులు ప్రదర్శించిన నాటకం, నృత్యాలు ఆహుతులను అలరించాయి. 'హెల్పింగ్ హాండ్స్' ద్వారా అందుతున్న సహాయాన్ని స్నేహ రైట్స్ విద్యార్థులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జివిఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.










