గీతాలు ఆలపిస్తున్న భజన బృంద సభ్యులు
ప్రజాశక్తి-రోలుగుంట:మండలంలో కుసర్లపూడి గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీరామలింగేశ్వర శివాలయం వద్ద హరిభజన నిర్వహించారు. పాకలపాడు గురువు ఆశ్రమం వద్ద భజన పోటీలు నిర్వహించారు. ఇవి భక్తులను అలరించాయి. భజన బృందం పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.10వేలు, రెండవ బహమతి రూ.5వేలు, మూడవ బహుమతి రూ.3వేలను ఈనెల 19న ఆదివారం ముఖ్య అతిధిగా రానున్న ముత్యాల వెంకటేశ్వరరావు(ఎంవిఆర్) చేతుల మీదుగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.










