ఎయు రెక్టార్ ప్రొఫెసర్ సమత
ప్రజాశక్తి -తగరపువలస : ఆలోచనలు ఎప్పుడూ సృజనాత్మకంగా ఉండాలని ఆంధ్రా యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ కె.సమత విద్యార్థులకు సూచించారు. బుధవారం స్థానిక అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఫ్రెషర్స్‌డే వేడుకలను జ్యోతి ప్రజ్వళనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్, మెడిటేషన్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కష్టపడే తత్వం ఉండాలని స్పష్టం చేశారు. సమయం చాలా విలువైనదని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన శ్రేయస్సును, మంచిని కోరే స్నేహితులను ఎంచుకోవాలని, ఆత్మ విశ్వాసం, ధైర్యంతో, సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎయు విశ్రాంత ఆచార్యులు కె చందుసుబ్బారావు, అవంతి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎ.చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.










