Aug 20,2023 23:00

ఎగ్జిబిషన్‌లో ఫొటోలు చూస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న ఫొటోగ్రఫీ టాలెంట్‌ని వెలికి తీయాలనీ, వారు మొబైల్స్‌తో వండర్స్‌ క్రియేట్‌ చేయొచ్చని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌, అధ్వర్యంలో నిర్వహించిన bటోగ్రఫీ పోటీలు అలరించాయి. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా, జాషువా సాంస్కతిక వేదిక , కామ్రేడ్‌ జి.ఆర్‌.కే అండ్‌ పొలవరపు సాంస్కతిక సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాఘవయ్య పార్క్‌ ఎదురుగా ఉన్న బాలోత్సవ్‌ భవన్‌ మొదటి అంతస్తులో మొబైల్‌ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌లి మరియు లిఫోటో ఆర్ట్‌ కాంటెస్ట్‌లి పోటీలు జరిగాయి. ఈ మొబైల్‌ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌లో 20 మంది యువ ఫొటోగ్రాఫర్స్‌ తీసిన 80 చిత్రాలను ప్రదర్మించారు. ఈ ఎగ్జిబిషన్‌ ను ఆదివారం ఉదయం సిఐఐ ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌.ఎమ్‌.లక్ష్మీ ప్రసాద్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల మధ్య 6 నుండి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు వినూత్నంగా ఫొటో ఆర్ట్‌ కాంటెస్ట్‌ నిర్వహించారు. ఈ కాంటెస్ట్‌ లో సుమారు 250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో డాక్టర్‌ ఇండ్ల స్వప్న, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ తమ్మా శ్రీనివాసరెడ్డి, బ్రిటిష్‌ కౌన్సిల్‌ అవార్డు గ్రహీత పాలడుగు అనసూయ, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం ప్రతినిధి పిన్నమనేని మురళీ కష్ణ, కామ్రేడ్‌ జి.ఆర్‌.కే, పోలవరపు సాంస్కతిక సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, సోమూరి కన్స్ట్రక్షన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేష్మా సోమూరి చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌ కన్వీనర్‌ సునీల్‌ కుమార్‌ అనుమకొండ, కోకన్వీనర్‌ గిరిధర్‌ అరసవల్లి, ఈవెంట్‌ మేనేజర్‌ స్ఫూర్తి శ్రీనివాస్‌, కోఆర్డినేటర్లు ఎస్‌.పి. మల్లిక్‌, కళాసాగర్‌ యెల్లపు, టీం మెంబెర్స్‌ స్వాతి పూర్ణిమ, సుధారాణి, శ్రావణ్‌ కుమార్‌ లు పాల్గొన్నారు.