May 07,2022 10:35

విశాఖ : నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ... శనివారం బీచ్‌రోడ్‌ లో ఉన్న అల్లూరి విగ్రహానికి అధికారులు నివాళులర్పించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌ కే రోజా, పలువురు నాయకులు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అల్లూరి సేవలను స్మరించుకున్నారు.