Jul 04,2023 20:55

అల్లూరి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని కలెక్టర్‌ గిరీష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అల్లూరి జయంతి వేడు కలలో భాగంగా అల్లూరి సీతారామరాజు చిత్ర పటా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయన దేశభక్తి, ధైర్య సాహసాలు, త్యాగనిరతిని యువత అలవరచుకోవాలన్నారు. గిరిజనుల హక్కు లను కాపాడేందుకు తన ప్రాణా లను పణంగా పెట్టిన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జీవి తం ఆదర్శ ప్రాయ మన్నారు. పరాయి పాలకుల దోపిడీ, దమనకాండల నుండి విముక్తి కొరకు గిరిజనులను చైతన ్యపరచి అల్లూరి సాగించిన సాయుధ పోరాటం తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుం ద న్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, కలెక్టరేట్‌ ఎఒ బాలకష్ణ, సమాచార శాఖ డిపిఆర్‌ఒ పురుషోత్తం, కలెక్టరేట్‌ సెక్షన్‌ సూపరిం టెండెం ట్లు, జిల్లా అది óకారులు, సిబ్బంది, అల్లూరి సీతారామరాజు చిత్రప టానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాయచోటి టౌన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుడు అల్లూరి సీతారా మరాజు అని ఎస్‌పి ఆర్‌.గంగాధర్‌రావు అన్నారు. మంగళవారం అల్లూరి సీతారా మరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లే యులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మి ఆచరణలో పెట్టిన మహానీ యుడు అల్లూరి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎఎస్‌పి డాక్టర్‌ విబి రాజ్‌కమల్‌, డిపిఒ, మినిస్ట్రియల్‌ సిబ్బంది, ఎస్‌బి, ఎఆర్‌, ఎస్‌ఇబి సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట రూరల్‌ : స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ జ్యోతిని రగిలించిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి, ఆకేపాటి అనిల్‌ కుమార్‌రెడ్డిలతో కలసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వీరబల్లి : అల్లూరి సీతా రామరాజు 125వ జయంతి వేడుకలను మండలంలోని బస్టాండ్‌ ఆవరణంలో మండల టిడిపి అధ్యక్షులు భానుగోపాల్‌రాజు ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వ హించారు. ముందుగా ఆయన చిత్రప టానికి పూల మాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రామ్మో హన్‌రెడ్డి, నాగ సుబ్బయ్య నాయుడు, జయచంద్రరెడ్డి, గ్రామ కమిటీ అధ్య క్షులు ఆంజనేయరెడ్డి, ప్రభాకర్‌నాయుడు రాజరాజు బాస్కర్‌రాజు, మహిళా కమిటీ అధ్యక్షురాలు నాగసుబ్బమ్మ ,వెంకట రామ రాజు, లక్ష్మిరెడ్డి, సీతారా మరాజు, బాలరాజు, యర్రయ్య, నరసింహులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : అల్లూరి సీతారామరాజు జయంతి సంద ర్భంగా స్థానిక జవుళీ బజారులోని సరస్వతీ విద్యా మందిరంలో అల్లూరి చిత్రపటానికి తెలుగు భాష సంరక్షణ సమితి జిల్లా సహాయ కార్యదర్శి గంగనపల్లి వెంకట రమణ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యా యురాలు కోడూరుగౌరీ, కష్ణమూర్తి, హైమావతి, రేఖా రాణి, దయాకర్‌, రాజశేఖర్‌, పుష్పలత, కళ్యాణి, శ్రావణి పాల్గొ న్నారు. లక్కిరెడ్డిపల్లి : బిసి వేదిక ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రామ చంద్రయ్య, కొర్లకుంట కష్ణ, పటేల్‌, సాదుల్లా ఖాన్‌, బసయ్య, రమణ, వెంకటేష్‌, శ్రీను పాల్గొన్నారు.