
ప్రజాశక్తి-యంత్రాంగం
అనకాపల్లి : విప్లవ వీరుడు అల్లూరి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రవి పటాన్‌శెట్టి పిలుపునిచ్చారు. అల్లూరి వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్‌లో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ అమాయకులు బలహీన వర్గాల వారికి ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరుపున నిలిచి, అల్లూరి పోరాటం సాగించారన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ పి.వెంకటరమణ చోడవరం, సబ్బవరం పాలిటెక్నిక్ కళాశాల వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక రైల్వే స్టేషన్ దరి అల్లూరి విగ్రహానికి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బోయిన భానుమూర్తి యాదవ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కాళ్ల సత్యనారాయణ, సత్యనారాయణ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సేనాపతి రాజు, సీనియర్ కాంగ్రెస్ నేత, టి. సుబ్బిరామిరెడ్డి సేవా పీఠం మాజీ సభ్యులు కెవి మాణిక్యం పాల్గొన్నారు.
అనకాపల్లి : విప్లవజ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని గూడ్స్ రోడ్డు వద్దనున్న అల్లూరి విగ్రహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే, నియోజకర్గ టిడిపి ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సీపట్నం, కేడీ.పేటలోని అల్లూరి సీతారామరాజు మ్యూజియం, పార్కును అభివృద్ధి చేస్తామన్న హామీని వైసిపి ప్రభుత్వం విస్మరించందని ఆరోపించారు. టిడిపి బిసి సాధికార రాష్ట్ర కన్వీనర్ మళ్ల సురేంద్ర, రాష్ట్ర ఎస్‌సి సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్, అర్బన్ జిల్లా కార్యదర్శి పోలారాపు త్రినాథ్, రాష్ట్ర సాంస్కతిక విభాగ నాయకులు పెనుమత్స సాయిరాజు, ఆళ్ల రామచంద్రరావు, సరిసా బుజ్జీ, దొడ్డి రాజేంద్ర, మళ్ల కృష్ణ పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : రాజాంలో అల్లూరి విగ్రహానికి పలువురు నేతలు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. మాజీ సర్పంచ్ సిఎఫ్‌టియుఐ జాతీయ ఉపాధ్యక్షుడు నాగులాపల్లి సత్యనారాయణ, టిడిపి నేతలు మరిసా సతీష్, మరిసా నరేషు, జెర్రిపోతుల రాజు ఎండపల్లి రాజు, మాణిక్యం గూడుపు సూర్యనారాయణ, బుజ్జి పాల్గొన్నారు.
మునగపాక రూరల్: తోటాడ, గవర్ల అనకాపల్లి గ్రామాలలో అల్లూరి వర్థంతి, సుందరయ్య జయంతులను నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆధ్వర్యంలో అల్లూరి, సుందరయ్య చిత్రపటాలకు సిఐటియు నేతలు, గ్రామపెద్దలు నివాళులర్పించారు. సిఐటియు జిల్లా కోశాధికారి వివి.శ్రీనివాసరావు, ఆళ్ల మహేశ్వరరావు, దొడ్డి కోటేశ్వరరావు, ఎలమంచిలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సత్యజగ్గారావు దాడి శ్రీనివాస్, దాడి రమణబాబు, పి నాగేశ్వరరావు, నరేంద్ర కుమార్, కాండ్రేగుల రాము, పెంట కోట జోగినాయుడు, ఆళ్ళ సూరిబాబు, దొడ్డి అప్పారావు పాల్గొన్నారు.
-గొలుగొండ:అల్లూరి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని నర్సీపట్నం ఆర్డీవో హెచ్‌వి.జయరాం కోరారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా మండలంలో ఎఎల్ పురం అల్లూరి పార్కులో అల్లూరి సమాధుల వద్ద ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా పార్క్‌లో ఉన్న అల్లూరి కాంస్య విగ్రహానికి, అల్లూరి గంటల సమాధులకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఇంచార్జి తహశీల్దార్ జి.ఆనందరావు, జిల్లా వైసిపి ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత, కేడీపేట ఎస్సై ఉపేంద్ర, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ హరి, సర్వేయర్ చినబాబు, స్థానిక ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్, విఆర్‌ఓ శ్రీధర్ స్థానిక పంచాయతీ కార్యదర్శి వై.శ్రీను, లోచల రమేష్, విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంథాలయంలో ఆదివారం గ్రంథాలయ అధికారి జనార్ధన ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అప్పలరాజు, నూకరాజు, సిబ్బంది రమణమ్మ పాల్గొన్నారు .
గొలుగొండ: చీడిగుమ్మల, చోద్యం, కృష్ణదేవిపేటలో సిపిఐ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాకిరెడ్డి రామానాయుడు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు రాధాకృష్ణ, పావడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గొలుగొండ:చీడిగుమ్మల గ్రామంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాకిరెడ్డి రామానాయుడు, లగుడు వెంకటరమణ ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎస్.మాధవ్ కృష్ణదేవిపేటలోని అల్లూరి సమాధులకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
నర్సీపట్నం టౌన్: అల్లూరి ఆశయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని సిపిఎం నాయకులు డి.సత్తిబాబు విమర్శించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గీతాకృష్ణ, కిరణ్ పాల్గొన్నారు.
స్థానిక అల్లూరి విగ్రహానికి సిపిఐ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ నుండి మన దేశాన్ని కాపాడు కోవాలన్నారు. దేశ సంపదను నేటి పాలకులు ప్రజలపై పెనుబారం మోపుతూ ప్రజా సంపదను అమ్మకాలు, తాకట్టు పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.గురుబాబు, డిసిహెచ్ క్రాంతి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎల్.వి.రమణ, సీనియర్ లాయర్ ప్రకాష్, నూకరాజు, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.