నివాళులర్పిస్తున్న అధ్యాపకులు
ప్రజాశక్తి-వేటపాలెం : అల్లం అప్పారావు ఆకస్మిక మృతికి మంగళవారం నివాళులర్పించినట్లు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సెక్రటరీ వనమా రామకష్ణారావు తెలిపారు. కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఫౌండర్, వైస్ చాన్స్‌లర్‌గా సేవలు అందించిన డాక్టర్ అల్లం అప్పారావు ఆకస్మికంగా మృతిచెందడం బాధాకరమని తెలిపారు. తొలుత అప్పారావు చిత్రపటానికి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజి నీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల యాజమాన్యం, సిబ్బంది నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ అనిల్ కుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










