అక్కడ పక్షులు
స్వేచ్ఛగా ఎగిరేవి
బౌద్ధం పరిఢవిల్లిన నేల
లోకం గర్వించదగ్గ
వారసత్వ సంపద ఆ నేలలో
తెగల పోరులో
దేశాన్ని మరచిన మౌఢ్యం
ఖనిజాల ఖనిపై
డేగ కన్ను
లోపాయికారీ సహకారం
ఉగ్రవాదంకి
చిన్న మొక్క ఇంతింతై వటుడింతై
డేగ కన్నునే పొడిచింది
గుడ్డి డేగ
దారి పొడవునా రక్త తర్పణం
చేస్తూ అణగదొక్కామనే భ్రాంతిలో
వనరుల దోపిడీ యే డేగ ఎరుగు
పోతూ పోతూ
ప్రజల్లో భయాన్ని నింపిపోయింది
ఉగ్రవాదం తేనె పలుకులు పలుకుతుంది
తేనె పూసిన కత్తి
ఎప్పుడు దిగుతుందోనని
గుండెల్లో అలజడి
గిరిప్రసాద్ చెలమల్లు
94933 88201










