ప్రజాశక్తి - కాకినాడ
ఎన్‌సిసిపిఏ, అల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్‌ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ పిలుపు మేరకు నిరసనలో భాగంగా బుధవారం సంతకాల సేకరణ జరిగింది. కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫా ర్సులు 18 నెలల డియర్ నేస్ రిలీఫ్ బకాయిలు, ఆరో వేతన సంఘం సిఫార్సులు 01-01-2006 నుండి అమలు చేయాలని, ఎల్‌జిఒలకు ప్రమోషన్స్ అమలు, డిసెంబర్ జూన్ నెలలో రిటైర్ అయిన వారికి ఒక ఇంక్రిమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ అమలు రైల్వేలో ప్రయాణిస్తున్న 60 సంవత్సరములు వారికి రాయితీ పునరుద్ధరణ తదితర కోర్కెల సాధనకు ఈ సంతకాల సేకరణ చేసి జూలై 21న జరిగే చలో పార్లమెంట్ నాడు ప్రధాని మోడీకి అందజేస్తామని అల్ ఇండియా పోస్టల్, ఆర్‌ఎంఎస్ డివిజనల్ కార్యదర్శి తురగా సూర్యారావు తెలిపారు. అల్ సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్ జనరల్ కార్యదర్శి ఎస్‌విఎన్ సాయిరాం మాట్లాడుతూ జూలై 21 చలో పార్లమెంట్ దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. అల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ సి డివిజనల్ కార్యదర్శి పి.సాగర్ పి4, కార్యదర్శి కే.శ్రీనివాసరావు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి వి.సుభద్ర, ఉదయ కామేశ్వరి, రమణమ్మ వైస్ ప్రెసిడెంట్ జి వి లక్ష్మీ నారాయణ, ఫైనాన్స్ కార్యదర్శి రామారావు జాయింట్ కార్యదర్శి ఏం.శ్రీని వాసరావు, గణపతి, త్రినాధరావు, రమణయ్య పంతులు, జి.భాస్కరరావు, కెవివిఎస్.సూర్యనారాయణ జి.చాముండేశ్వరి, జి.సర్వేశ్వరరావులు పాల్గొన్నారు.










