
హైదరాబాద్ : అక్కినేని వారసుడు అఖిల్ తన పేరుతో వచ్చిన సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది.. ఆ తర్వాత అఖిల్ వరుసగా సినిమాలు చేసినా... బిగ్గెస్ట్ హిట్‌ను కొట్టలేకపోయాడు. అయితే అఖిల్ మాత్రం పరాజయాలతో నిరుత్సాహపడకుండా.. హీరోగా తనేంటో నిరూపించుకోవడానికి తెగ కష్టపడిపోతున్నాడు. తానెంతగా శ్రమిస్తున్నాడో.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫొటోని చూస్తేనే తెలిసిపోతుంది. తాజాగా తాను నటించే ఏజెంట్ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఈ సినిమాలో అఖిల్ గుబురు గెడ్డం.. మీసకట్టు.. హెవీ హెయిర్, కండలు తిరిగిన దేహంతో కొత్తగా కనిపిస్తున్నాడు. లుక్‌పరంగా అఖిల్ ముందే మార్కులు కొట్టేశాడు.
ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొద్దిభాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా సురేందర్‌ర్డెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎకె ఎంటర్టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఈ చిత్రాన్ని ఓటీటీలోనా.. థియేటర్లో విడుదల చేయాలా అనే దానిపై చర్చ సాగుతోందని వార్తలొస్తున్నాయి.