Nov 09,2023 21:50

విజయశంకర స్వామి

అఖండ శివనామ స్మరణకు అవకాశమివ్వండి: విజయ శంకర స్వామి
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
టీటీడీ తరహాలో ముక్కంటి చెంత అఖండ శివనామ స్మరణ పారాయణం చేసేందుకు స్థానిక జానపద, భజన బందాలకు అవకాశం కల్పించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర స్వామి డిమాండ్‌ చేశారు. జానపద వత్తి కళాకారుల సంఘం, అన్నమయ్య కళాక్షేత్రం(తిరుపతి) ఆధ్వర్యంలో గురువారం శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధ శివ సదన్‌ లో జానపద గురువులు, భజన బంద నాయకుల జిల్లాస్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ శంకర స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, సనాతన సమ ధర్మాన్ని స్థానికంగా ఉన్న జానపద, భజన బంద కళాకారులు క్షేత్రస్థాయిలో చాటి చెబుతున్నారని తెలిపారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో 2 వేలకు పైగా జానపద, భజన బందాలున్నాయనీ, అయితే టీటీడీ తరహాలో శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి కళాకారులకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. పల్లెల్లో ప్రాచీన కళలు అంతరిచిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కంటి చెంత శివ పారాయణం చేసే జానపద, భజన బందాల కోసం టీటీడీ మహతి లాగా, శాశ్వత ధూర్జటి కళాక్షేత్రాన్ని నిర్మించాలని కోరారు. జానపద వత్తి కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి గెడి వేణు, సంక్రాంతి వెంకటయ్య, శ్రీనివాస్‌, భజన గురువులు మునస్వామి, జగదీశ్వరయ్య, సుధాకర్‌ స్వామి, సుబ్రమణ్యం, సురేష్‌, జై భారత్‌ ఆర్గనైజేషన్‌ నాయకులు మహేష్‌, లక్ష్మణ్‌, రజిని, కుమార్‌, రాజా తదితరులు పాల్గొన్నారు.
విజయశంకర స్వామి