Dec 27,2022 23:51

అఖిల భారత డ్వాక్రా బజార్‌ను ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్‌ను ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మంగళవారం సాయంత్రం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తోందన్నారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్టాళ్లను ఆయన సందర్శించారు. ఈ అఖిల భారత డ్వాక్రా బజార్‌ జనవరి 7వ తేదీ వరకు ఉంటుందని, దేశంలోని 10 రాష్ట్రాల నుంచి 218 స్టాళ్లు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివద్ది శాఖా ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణద్వివేది జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.