మాట్లాడుతున్న ఎఫ్‌డిఒ లావణ్య
ప్రజాశక్తి -భీమునిపట్నం : సమీకత సాగు, వ్యవసాయ పరివర్తన పథకంలో భాగంగా జివిఎంసి నాలుగో వార్డు కొత్తూరు పిసిఆర్ ల్యాబ్ వద్ద బుధవారం ఆక్వా రైతులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎఫ్‌డిఒ లావణ్య మాట్లాడుతూ, ఆక్వా రైతులకు బోర్లు, వలలు, దుక్కులు,మోపెడ్లు, ఫిష్ పాండ్స్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ సమర్పణ రాజు మాట్లాడుతూ, ప్రకతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మత్య సంపద సస్యరక్షణ, ఇతర జాగ్రత్తలపై వివరించారు. మత్య్సకార సొసైటీ ప్రతినిధి ఎస్ గణేష్, సంస్థ ప్రతినిధి జి ఎల్ నాయుడు, శారద వ్యాలీ డెవలప్‌మెంట్ సిబ్బంది కె అప్పారావు, వి.చక్రి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల మత్యకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు










