Mar 17,2023 00:00

మాట్లాడుతున్న మత్స్యశాఖ అధికారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపెడ ఆధ్వర్యంలో గురువారం ఆక్వా కల్చర్‌ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడి లక్ష్మణరావు మాట్లాడుతూ, ఆక్వా కల్చర్‌ సాగులో నూతన విధానాలు పాటించి, సాంకేతిక పద్ధతులు వినియోగిస్తే నాణ్యమైన దిగుబడులు వచ్చి లాభాలు వస్తాయన్నారు. నిషేధిత యాంటీబయోటిక్స్‌ వినియోగించద్దని సూచించారు. అనుమతులు లేకుండా చెరువులు సాగు చేస్తున్న వారికి, కొత్తగా సాగు చేసే వారికి ఏపీ ఆక్వా కల్చర్‌ డెవలప్మెంట్‌ అథారిటీ ద్వారా రెగ్యులర్‌ చేస్తున్నామన్నారు. చెరువుల్లో విభిన్న జాతుల సాగు పై దృష్టి పెట్టారని తెలిపారు.
ఎంపెడ ఏడి ప్రసాద్‌ నాయక్‌ మాట్లాడుతూ, ఎగుమతుల కారణంగా ఖర్చు పెరిగిందని రైతులు సాగులో ఖర్చులు తగ్గించే పద్ధతులు పాటించాలన్నారు. ఆక్వా కల్చర్‌ రైతులు తమ సమస్యలను అధికారులకు వివరించారు. ఆక్వా కల్చర్‌ రైతులకు విద్యుత్తు రాయితీలు ఇతర సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే ఆక్వా రైతులంతా నష్టపోయి ఉన్నారని, సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ జిల్లా అధ్యక్షులు మాతా గురునాథరావు, ఎంపీడీవో సీతారామరాజు, అధికారులు విజరుకృష్ణ, ఆనంద్‌ కుమార్‌, సంతోషి రూప తదితరులు పాల్గొన్నారు.