ప్రజాశక్తి - భీమడోలు
ఆక్వారంగ అభివృద్ధికి మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ చేసిన చేసిన సేవలు అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మల్కీ మహమ్మద్‌పురంలోని వసంత కుమార్ స్వగృహానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి ఆయన తండ్రి వివిఆర్.పార్థసారధి వటి వసంతకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వసంతకుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వసంతకుమార్ కుటుంబ సభ్యులను ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు, కాంగ్రెస్ ప్రముఖులు కనుమూరి బాపిరాజు, బొల్లిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీలు కెవిపి.రామచంద్రరావు, లక్ష్మీనారాయణ పరామర్శించారు.










