Feb 08,2023 23:35

మృతుడు లోవరాజు కుటుంబంతో మాట్లాడుతున్న ఎంపిడిఒ ఉమామహేశ్వరరావు

'జీలుగుకల్లు' మృతుని కుటుంబానికి పరామర్శ
ప్రజాశక్తి -సీలేరు

జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ ఆకులూరి గ్రామాన్ని జికె.వీధి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు బుధవారం సందర్శించారు. జీలుగు కళ్ళు తాగి మృతి చెందిన పాంగి లోవరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. గిరిజనులు జీలుగు కళ్ళు తాగి నలుగురు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటనపై కుటుంబ సభ్యులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఎంపీడీవో మాట్లాడుతూ జీలుగు కళ్ళు తాగిన నలుగురిలో లోవరాజు తండ్రి పాంగి రామదాసు ప్రస్తుతం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుడు పాంగి లోవరాజు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి రావలసిన వైఎస్‌ఆర్‌ బీమా, లోవరాజు భార్యకు వితంతు పెన్షన్‌, జాబ్‌ కార్డు ద్వారా ఏమైనా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరితే వాటిపై దృష్టి సారించి ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. ఎంపిడిఒ వెంట పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులున్నారు.