Apr 22,2023 00:30

ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులు

ప్రజాశక్తి-గొలుగొండ:పాతకృష్ణదేవిపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఫేర్‌వెల్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కోటవురట్ల:మండలంలో బోడపాలెం మండల పరిషత్‌ పాఠశాలలో ఘనంగా ఫేర్‌వెల్‌ డే నిర్వహించారు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ అప్పారావు, స్థానిక సర్పంచ్‌ ఎరుకు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఉత్సా హంగా సాగాయి. అనంతరం ఎంఈఓ అప్పారావును సన్మానిం చారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో చిన్నారులు తీసుకోవలసిన జాగ్రత్తలను ఉపాధ్యాయులు తెలియజేయాలన్నారు వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.