Feb 26,2023 23:46

శక్తి వేషాలు

ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లిలో ఆదివారం రజకుల పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ అనంతరం ఫిబ్రవరి నెలలో రజకులు పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రజకులు పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రజకుల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన శక్తి వేషాలు ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.