Mar 04,2023 23:23

నృత్యాలు చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:మండలంలోని తాంగుల గుడలో రాధాకృష్ట దేవాలయంలో ఏకాదశి మహౌత్సవ సందర్భంగా గిరిజన మహిళా సంఘం అద్వర్యంలో థింసా నృత్యాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమం తాంగులగూడ, శరభగూడ దేవాలయ ఉత్సవ కమిటి సభ్యులు సహకారంతో ఐద్వా మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు వివి జయ అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు వివి జయ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో గతంలో ఉన్న గిరిజన సంస్కతిని గుర్తు చేసుకునేందుకు ఇటువంటి కళా నృత్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకుగాను సుమారు నెల రోజులు నుండి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ పెద్దలు తాంగుల హరి, కోర్ర మగ్గన్న, కీల్లో జగనాధం, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ నాయకులు నిర్మల, కొసల్య, మొనిమ, రాధ, భవాని, అరుణ పాల్గొన్నారు.