Jan 16,2023 23:30

నాటిక ప్రదర్శిస్తున్న కళాకారులు

ప్రజాశక్తి-మాడుగుల:సంక్రాంతి సంబరాలలో భాగంగా మాడుగులలో భారత నిర్మాణ సేన అధ్వర్యంలో సంక్రాంతి రోజున ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. పాత్రికేయులు సురేష్‌ శాంతో దర్శకత్వంలో అప్పలాచార్య రచనతో ప్రదర్శించిన నాటికను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తిలకించారు. భజగోవిందం పాత్రలో లకిడ పు సుందరారాజు, డాక్టర్‌ కైలాసంగా జా గాని ఈశ్వరరావు, సీతాపతిగా గర్బాబు దామోదరం, పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకుల్లా సురేష్‌ శాంతో, బైరా శ్రీను, తాడి గణేష్‌, శంఖం, గంట వాళ్ళుగా యూసఫ్‌, కాసిమ్‌, ఫారిన్‌ డాక్టర్‌గా సూర్యారావు, కాంపౌండర్‌గా తూరుబిల్లి అర్జున తదితరులు నటించారు. సంగీతం పేలూరి నారాయణరావు, మేకప్‌ అనకాపల్లికి చెందిన శివాజీ నిర్వహించారు.కొద్ది కాలం తరువాత ప్రదర్శించిన ఈ నాటికను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తిలకించారు. నాటిక అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్‌కు లక్ష రూపాయలు విరాళం అందించిన బుచ్చయ్య చౌదరి, బసవ పున్నామ్మ, కుమార్తె పావని, అల్లుడు కోడె దుర్గాప్రసాద్‌తో పాటు, మాజీ సర్పంచ్‌ నాటిక పర్యవేక్షణ వహించిన దంగేటి సూర్యారావు దర్శకత్వం వహించిన సురేష్‌ శాంతో తదితరులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భమిడి పాటు శాస్త్రి, తవ్వా సన్యాసిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బుల్లి తెర నటుడు, గ్రామానికి చెందిన గౌరీపట్నం ప్రసాద్‌ వ్యవహరించారు.