ప్రజాశక్తి -అరకులోయ /అరకు రూరల్:ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఎనిమిదవ మహాసభల సందర్భంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో 6,7,8 తేదీల్లో ఆట పాట మాట అనే నినాదంతో జరుగుతున్న ఆదివాసి సంస్కతిక సంబరాలు గిరిజన సంస్కతి సాంప్రదాయాలను ప్రతి ప్రతిబంభించాయి. రెండో రోజుకీ కార్యక్రమాన్ని గిరిజన సంఘం జాతీయ కార్య వర్గ సభ్యుడు బి.అప్పలనర్స, రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, సంస్కతిక సంబరాల నిర్వహణ కమిటీ చైర్మన్ చిట్టిబాబు, రఘునాథ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు మంగరాజు, కన్వీనర్ జోషి ప్రారంభించారు.
మునుపెన్నడూ లేని విధంగా మరుగున పడిపోయిన గిరిజన సంస్కతి, సంప్రదాయాలను భావ్య ప్రపంచానికి తీసుకుని వచ్చి స్వతంత్ర సమర యోధుడు ఆదివాసి పోరాట యోధుడు మరి కామయ్య కళావేదిక వద్ద ప్రదర్శించిన వివిధ కళా ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంది. గిరిజన సంస్కతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేసిన ప్రదర్శనలు గిరిజన సంస్కతికి దర్పణం పట్టాయి. మొదటి రోజు ఈ వేదికలో వేసిన 10 రకాల కళారూపాలు అంతరించి పోతున్న గిరిజన సంస్కతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి జీవం పోసాయి. రెండవ రోజు అందుకు భిన్నంగా వేసిన కళా ప్రదర్శనలు సంస్కతిక ప్రదర్శనలతో పాటు రాజమండ్రి శ్రీరాములు ప్రదర్శించిన మెజీషియన్సు అమితంగా ఆకట్టుకుంది. దుమ్మగూడ, చొంపి గ్రామానికి చెందిన గిరిజన సంస్కతిక దింసా నృత్య ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. డుంబ్రిగూడ మండల జాపరవలస సంకటి నృత్యం ముచ్చంగిపొట్టు బ్రాండ్ బాజా, మాడగడ వాయిద్యం, చొంపిబుట్ట దింసా, కిరాయిగూడ అలెక్ భజన, మర్రిగూడ తగిల నాటకం, జాతర వలస బుడియా నాటకం విశేషంగా ఆకట్టుకున్నాయి.
గిరిజన సాంస్కతిక సంబరాల్లో పాల్గొన్న ప్రతి కళా బృందానికి ఆదివాసి సంస్కతిక సంబరాల నిర్వహణ కమిటీ నాయకులు గిరిజన సంఘం నాయకులు వివిధ పాఠశాలల గిరిజన ప్రధానోపాధ్యాయులు మెమొంటోలు సర్టిఫికెట్లు అందజేశారు. ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ సంస్కతిక ప్రదర్శనలకు సంబంధించి అధ్యక్షతత వహించారు. గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనరస, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర, మంతెన సీతారాం, పోతురాజు, కొండలరావు, వివిధ గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ప్రతినిధులు చిట్టిబాబు, కే.రఘునాథ్, దేముడు, గిరిజనులు వేసిన సంస్కతిక నత్య ప్రదర్శనలను తిలకించారు.
సంబరాల్లో పాల్గొన వివిధ కళాబందానికి ప్రధానో ఉపాధ్యాయులు దయానిది, నారాయణ, మహేష్ నందు, అప్పలనరస, ముఖి సాంబయ్య, కృష్ణకుమారి, విజరు కుమార్, రాంబాబు, రెవెన్యూ శాఖ ఎలక్షన్ డ్యూటీ అప్పన్న, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, తదితరులు మెమొంటు సర్టిఫికెట్లు అందజేశారు.










