ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లిలో ఈ నెల 22 23 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులను ఆకట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా 103 పాఠశాలల నుంచి 117 ప్రాజెక్టులు ఐదు ఉప అంశాలతో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ ఛేంజ్, హెల్త్ అండ్ క్లీన్లినెస్, సాఫ్ట్‌వేర్ అండ్ యాప్స్, మ్యాథమెటికల్ మోడలింగ్‌లో ప్రదర్శించారు. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్‌లో కోటవురట్లకు చెందిన పి.పద్మశ్రీ, పి.ప్రకాష్ ప్రథమ, ద్వితీయ స్థానాలు, ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ ఛేంజ్‌లో సబ్బవరం, శెట్టిపల్లికి చెందిన బి.మోన్షిత బి.పల్లవి ప్రథమ ద్వితీయ స్థానాలు, హెల్త్ అండ్ క్లీన్లీనెస్‌లో గుడిచర్ల, ఆరిపాక పాఠశాలలకు చెందిన పి.సోమనాథ్, పి.వర్షిత, సాఫ్ట్‌వేర్ అండ్ యాప్స్‌లో వీరనారాయణపురం, అచ్యుతాపురం రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన వై త్రివేణి, ఎస్.యామిని, మ్యాథ్‌మెటికల్ మోడలింగ్‌లో తిమ్మరాజుపేట, లింగరాజుపాలెం పాఠశాలలకు చెందిన ఎస్.ఆదిత్య, జి గణేష్ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ, ఉప విద్య శాఖ అధికారి ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.రవి బాబు, ఏపీవో వెంకటేశ్వరరావు, అనకాపల్లి, కసింకోట ఎంఈఓలు దివాకర్, చిట్టిబాబు అభినందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రాజెక్టులను ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడ లయోలా కళాశాలలో ప్రదర్శిస్తారని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు.










