Oct 28,2023 21:33

ప్రజాశక్తి - ఉండ్రాజవరం అన్నపూర్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్‌ గ్యాలరీ, ఫుడ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం ఆకట్టుకుంది. శనివారం ఏర్పాటుచేసిన ఆర్ట్‌ గ్యాలరీ, ఫుడ్‌ ఫెస్టివల్‌లో విద్యాసంస్థల విద్యార్థులు సుమారు 2 వేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌కెజి నుంచి ఇంటర్మీడియట్‌ స్థాయి విద్యార్థులు వివిధ రకాల ఆర్టులు, పెయింటింగులు, పరిశోధనలు, నిర్మాణ సామాగ్రి తయారుచేసి, ప్రదర్శించారు. వాటిలో వందే భారత రైలు, అయోధ్య రామాలయం, ఈఫిల్‌ టవర్‌, సోలార్‌ సిస్టం, పలు రకాల చేతి తయారీ వస్తువులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రయోగశాలలో సైతం చంద్రయాన్‌ 3, రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, హార్వెస్టర్‌ ఆక్సిజన్‌ జనరేటర్‌, ఆటోమేటిక్‌ ఆల్కహాలిక్‌ టెస్ట్‌ డ్రైవ్‌ వెహికల్‌ వంటి పలు రకాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ విద్యాసంస్థల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ నందిగం వెంకట సీతారామయ్య. మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత, భావవ్యక్తీకరణ వంటి లక్షణాలు పెంపొందెందుకు ఇటువంటి ఈవెంట్లు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి నందిగం భాస్కర రామయ్య, కఠారి సిద్ధార్థ రాజు తదితరులు పాల్గొన్నారు.