Oct 31,2022 21:32

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
          స్థానిక శ్రీనివాస థియేటర్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటోంది. ఈనెల 26వ తేదీన ప్రారంభించిన ఈ క్రాఫ్ట్‌ బజారులో వివిధ ప్రాంతాల్లో చేనేత కళాకారులు తయారుచేసిన హస్తకళలలను ప్రదర్శనకు, అమ్మకానికి ఉంచినట్లు క్రాఫ్ట్‌ బజారు మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ప్రదర్శనలో ఖాదీ వస్త్రాలతో పాటు, బెంగాలీ కాటన్‌ చీరలు, సారన్‌పూర్‌ ఉడ్‌ వస్తువులు, ఇమిటేషన్‌ జ్యూయలరీ, వరంగల్‌ టవల్స్‌, కలంకారీ డ్రస్సులు, జైపూర్‌ దుప్పట్లు, లేదర్‌ క్రాఫ్ట్స్‌, కాశ్మీర్‌ టాప్స్‌, రెడీమేడ్‌ దుస్తులు, ఫ్లవర్‌ పాట్స్‌తో పాటుగా రాజస్తాన్‌ గాజులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే ఏలూరు నగరంలో కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. హస్తకళాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.