Jul 22,2022 23:23

.చిత్ర కళా ప్రదర్శననుతిలకిస్తున్న రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌

ప్రజాశక్తి- విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం విద్యార్థిని, కొలంబియా దేశస్థురాలు లిడా రమిరిజ్‌ సోలో ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంది. నాలుగేళ్లుగా వర్సిటీ చిత్రకళా విభాగంలో తాను నేర్చుకున్న విద్యను ప్రదర్శించే వేదికగా గ్రాటుట్యూడ్‌ చిత్రకళా ప్రదర్శను బీచ్‌రోడ్డులోని హవామహల్‌లో ఏర్పాటు చేశారు. ప్రదర్శనను ఎయు రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. భారతీయ గ్రామీణ, ప్రజల జీవన విధానాలను ఆకలింపు చేసుకున్న, కళాకారిణి లిడా తీర్చిదిద్దిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. చెక్క, మట్టి, మెటల్‌తో తన చుట్టూ సమాజంలో చూసిన అనేక సంఘటనలు, వ్యక్తులకు రూపం కల్పించింది. భారతీయ మహిళలు, మత్స్యకారులు, గ్రామీణ జీవనాలను కాన్వాస్‌పై వర్ణాలనద్ది రూపం కల్పించిన విధానం ఆకట్టుకుంది. చిత్రకారిణిని లిడా రమిరిజ్‌ను రిజిస్ట్రార్‌ అభినందించారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు వి.రమేష్‌, ఆచార్య ఆదినారాయణ, విభాగాధిపతి ఆచార్య సింహాచలం, డీన్‌ ఆచార్య ఇ.ఎన్‌ ధనుంజయ రావు, మయూఖ కుమారి దేవి పాల్గొన్నారు.