ప్రజాశక్తి - బాపట్ల
హెచ్ఆర్ పాలసీ అమలుకై (వెలుగు) వివోఏల 36గంటల ధర్నాలు జయప్రదం చేయాలని వివోఏల జిల్లా అధ్యక్షురాలు పుణ్యలక్ష్మి కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో మంగళవారం జరిగిన వివోఏల జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వెలుగు డిపార్ట్ మెంట్‌లో పనిచేస్తున్న యాని మేటర్లకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. కాలపరిమితి జీవో రద్దు చేయాలని కోరుతూ అక్టోబర్ 10, 11తేదీల్లో బాపట్ల కలెక్టరేట్ వద్ద 36గంటల మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో యానిమేటర్లు గ్రామీణ ప్రాంతంలో విశేష కృషి చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు వివోఏలు కలిసికట్టుగా ఉద్యమించాలని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ మాట్లాడుతూ ఐక్యంగా పనిచేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జె జ్యోతి, పి పద్మావతి, టీ చిన్న,కె రాధా, కె కృష్ణకుమారి, జి నాగవర్ధిని పాల్గొన్నారు.










