Aug 25,2023 23:46

సమావేశంలో మాట్లాడుతున్న జెసి రాజకుమారి

గుంటూరు : గ్రామ సచివాలయం స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అక్టోబర్‌ 2 నుండి నవంబర్‌ 8 వరకూ నిర్వహించనున్న 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సంయుక్త కలెక్టర్‌ జి. రాజ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై జేసీ రాజ కుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీ బాల్‌, కబడ్డీ, ఖోఖో క్రీడాంశాలు వున్నాయ న్నారు. 17 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరూ వీటిల్గొ పాల్గొనవచ్చన్నారు. సచివాలయ స్థాయిలో అక్టోబర్‌ 2 నుండి 7వ తేదీ వరకు, 10వ నుండి 19 వరకూ మండల స్థాయిలో, 22 నుండి 25 వరకూ నియోజకవర్గ స్థాయిలో, 28 నుండి 31 వరకూ జిల్లా స్థాయి పోటీ లు, నవంబర్‌ 4 నుండి 7 వరకూ రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలకు అవస రమైన అవసరమైన ఆట స్థలాలు గుర్తింపు, భోజన వసతి , వైద్య సదుపాయాలు, రవాణా తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పోటీలలో గెలిచిన వారికి ట్రోఫీలు, మెడల్స్‌ , సర్టిఫికెట్లు, నగదు బహుమతి కూడా ఉంటుంద న్నారు. సమావేశంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, డిఆర్‌ఓ కె.చంద్ర శేఖర రావు, ఆర్‌డిఒ ప్రభాకర రెడ్డి, స్టెప్‌ సిఈఓ యస్‌.పల్లవి తదితరులు పాల్గొన్నారు.