Dec 03,2022 23:23

సిబ్బందితో మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ

ప్రజాశక్తి-హుకుంపేట : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బయట వ్యక్తులు ప్రవేశించకుండా ప్రిన్సిపల్‌ కార్యదర్శి కాంతిలాల్‌ దండే జారీ చేసిన ఆదేశాలు పక్కాగా అమలు చేయాలని ఐటిడిఎ పిఓ రోణంకి గోపాలకృష్ణ అన్నారు.ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆదేశాలను పక్కదారి పట్టిస్తే పాఠశాల యజమాన్యంపై చర్యలు తప్పవని ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఓల్డా, రాప, రంగశీల సంతారి గ్రామ సచివాలయంలను మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ తనిఖీ చేశారు. సచివాలయ రికార్డులను తనిఖీ చేసారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. మూమెంట్‌ రిజిస్టర్‌ పక్కాగా నిర్వహించాలని చెప్పారు. గిరిజన సమస్యలు సచివాలయం పరిధిలో పరిష్కరించాలని అదేశించారు. అనంతరం పెదగరువుగిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల విద్యా బోధనలపై విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. విద్యార్ధుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి చెప్పారు. స్టాక్‌ రూమ్‌ పరిశీలించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయురాలు కొండమ్మ ఉన్నారు.