Oct 14,2023 22:43

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌ ఆకర్షణీయమైన వడ్డీతో ధరణీ డిపాజిట్లను ఈనెల 16వ తేదీ నుండీ ప్రారంభించనుంది. డిపాజిట్ల సేకరణ కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఖాతాదార్లకు శుభవార్త ప్రకటించింది. 46 రోజుల పాటు డిపాజిట్లను సేకరించనున్నారు. జిల్లా సహకర బ్యాంకులో డిపాజిట్లు చేసి రూ.8ల వడ్డీ పొందాలని, ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, బ్యాంకు సీఈవో మనోహర్‌గౌడ్‌ కోరుతున్నారు. డిపాజిట్లు, ఇతర వివరాల కోసం స్థానిక సహకర కేంద్ర బ్యాంకు బ్రాంచ్‌లను సంప్రదించాల్సి ఉంటుంది.
సీనియర్‌ సిటిజన్స్‌కు 8.50 శాతం వడ్డీ
కనిష్ట ధరణి డిపాజిట్‌ రూ.1000లకు పైబడి స్వీకరించబడుతుంది. సీనియర్‌ సిటిజన్స్‌కు 0.50 శాతం అదనపు వడ్డీ అందనుంది. డిఐసిజిసి ఇన్సూరెన్స్‌ రక్షణ కల్పించనున్నారు. జిల్లా సహకర కేంద్ర బ్యాంకలో పొదుపు చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకుల కంటే అదనపు వడ్డీ పొందే అవకాశం కల్పిస్తున్నారు.
సైట్‌ మార్ట్‌గేజ్‌ లోన్స్‌...
జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బ్రాంచ్‌లలో లోన్లు అందిస్తున్నారు. కనీస లోను పరిమితి రూ.3లక్షలు, గరిష్ట లోను పరిమితి రూ.15లక్షలు లోనుపై 13శాతం తక్కువ వడ్డీతో అందిస్తున్నారు. లోను పరిమితి 72మాసాల్లో ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
రూరల్‌ హౌసింగ్‌ మార్ట్‌గేజ్‌
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రూరల్‌ హౌసింగ్‌ మార్ట్‌గేజ్‌ రుణాలను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా అందిస్తున్నారు. రూ.3 లక్షల నుండీ 10లక్షల వరకు 13 శాతం వడ్డీతో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల తనఖా పెట్టేవారికి రుణాలు అందించనుంది. 72 నెలల్లో ఈఎంఐ ద్వారా తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ట్రేడర్స్‌ -ఎస్‌హెచ్‌జీలకు..
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బ్రాంచ్‌ల్లో వ్యాపార అవసరాల కోసం రూ.50 వేల నుండీ రూ.3లక్షల వరకు 12శాతం వడ్డీతో అందించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు అర్హతను బట్టి రూ. 2లక్షల నుండీ రూ. 20లక్షల వరకు ఎటువంటి డాక్యూమెంట్‌, ప్రాసెన్సింగ్‌ ఛార్జీలు లేకుండా 9శాతం (75 పైసలకు) రుణాలు అందిస్తోంది.
హౌస్‌ మార్ట్‌గేజ్‌, గృహనిర్మాణ రుణాలు
మేజర్‌ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఉన్న అన్ని బ్రాంచ్‌ల్లో గృహ మార్ట్‌గేజ్‌ రుణాలు రూ.3లక్షల నుండీ రూ.20 లక్షల వరకు అందిచనున్నారు. 13శాతం వడ్డీతో తిరిగీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.10లక్షల లోను కాలపరిమితి 96మాసాలు, రూ.10లక్షలకు పైబడిన రుణాలకు కాలపరిమితి 120మాసాల్లో చెల్లించాల్సి ఉంటుంది. గృహ నిర్మాణాల కోసం అందించే రూ.5లక్షల నుండీ రూ. 40 లక్షల రుణాలు 9శాతం తక్కువ వడ్డీతో 120 మాసాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి (జిల్లా సహకార కేంద్రబ్యాంకు ) ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ పిలుపునిచ్చారు.