Feb 04,2023 23:59

మాట్లాడుతున్న ఎస్‌ ఐ లక్ష్మణరావు,

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌:
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో ప్రధాన రహదారి వెంబడి నిర్మించిన డ్రైనేజీ దాటి నిర్మించిన షాపులను స్వచ్ఛందంగా తొలగించాలని పంచాయతీ, రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి ఆక్రమణదారులకు సూచించారు. డ్రైనేజీ దాటి షాపుల అక్రమణల వలన పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పట్టణంలోని షాపుల యజమానులు, చిరు వ్యాపారులతో శనివారం మోదమాంబ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలో డ్రైనేజీ కాలువలపై, కాలువలు దాటి ఏర్పాటు చేసిన వ్యాపారాలను తొలగించాలని స్పష్టం చేశారు. ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించకుంటే అధికారులే తొలగిస్తారని హెచ్చరించారు. కూరగాయల వ్యాపారులు పాత బస్టాండ్‌, అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద రైతు బజార్‌ కు వెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఉషారాణి, ఎంపిడిఒ సాయి నవీన్‌, ఎస్‌ఐ జి.లక్ష్మణరావు పాల్గొన్నారు.