Sep 24,2023 01:29

ప్రజాశక్తి - బాపట్ల
పట్టణంలోని సూర్యలంక రోడ్డు విస్తరణలో డ్రైనేజీపై ఉన్న కొందరు చిరు వ్యాపారులనే ఎందుకు తొలగిస్తున్నారని మునిసిపల్ అధికారులపై పలువురు చిరు వ్యాపారులు వాదనకు దిగారు. బాపట్ల -సూర్య లంక మార్గంలో పట్టణంలోని వ్యవసాయ కళాశాల ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న ఆక్రమణల తొలగింపుపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే డ్రైనేజీలపై ఉన్న కొందరిని ఎందుకు తొలగించడం లేదంటూ నిలదీశారు. రథం బజార్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపైనే షాపులు నిర్వహిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మున్సిపాలిటీకి పన్ను చెల్లిస్తున్నా కూడా తమనే ఎందుకు తొలగిస్తున్నారని అన్నారు. సమయం కూడా ఇవ్వకుండా ఉన్నఫలంగా ఖాళీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. షాపులు సర్దుకునే కనీస సమయం ఇవ్వాలని కోరారు. తమకు ప్రత్యామ్నయం చూపాలని కోరారు.