ప్రజాశక్తి-చీరాల : కుందేరుపై ఆక్రమ నిర్మాణాలు చేపడు తున్నారని, అది óకారులు ఆక్రణ దారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కోరారు. కుందేరులో అక్రమ నిర్మాణాలపై స్పందన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిధులు మంజూరు కాకుండా నిర్మాణాలు ఎలా చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. మురుగు నీటి పారుదల వనరులను ఆక్రమిం చడం వల్ల భవిష్యత్తులో వరద ప్రమాదం ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన జేసి శ్రీధర్ డ్రైనేజీ, పంచాయతీరాజ్ శాఖ అధి కారులను పిలిపించి విచారిం చారు. నిధులు ఎవరు మంజూరు చేశారు, అను మతులు ఎవరు ఇచ్చారు, నీటిపారుదల వనరులలో నిర్మాణాలు ఎలా చేస్తున్నారనే పూర్తి వివరాలతో వచ్చేనెల 3 లోపు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.










