ఆక్రమణ స్థలంలలో హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేస్తున్న రెవెన్యూ సిబ్బంది
ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని ఆనందపురం ఎస్‌సి, బిసి కాలనీలో సుమారు 40 సెంట్లు ఆక్రమణ స్థలంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. హైస్కూల్ పక్కన ఎస్‌సి, బిసి కాలనీ సర్వేనెంబర్ 276లో 40 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమణకు పాల్పడునట్లు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. తహసీల్దార్ లోకవరపు రామారావు ఆదేశాల మేరకు విఆర్‌ఒ అప్పలరెడ్డి ఆధ్వర్యాన విఆర్‌ఎ అప్పలరాజు స్వర్ణలత హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రామారావు మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.










